అమరావతి : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. జనసేన పార్టీ బలాన్ని చూపించాల్సిన ఎన్నికలు ఇవి. కూటమిలోని అన్ని పార్టీల నాయకులను కలుపుకొని సమష్టిగా ఎన్నికలల్లో ముందుకు సాగాలి. జన సైనికులకు క్రమశిక్షణే బలం. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం. సోషల్ మీడియా లో అనవసర అపోహలకు, ప్రచారాలకు దూరంగా ఉండండి. మన అధినేత ఏం చెప్తే అది మాత్రమే వినండి, దాన్నే ఆచరించండ అని పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ .. మొదటి దశలో జరగబోయే అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచు కోవడం చాలా కీలకమైంది అన్నారు. బలబలాలను పక్కాగా బేరిజు వేసుకొని, ఎన్నికల రణరంగంలో దిగి, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి అని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్ వేదికగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, ఉత్తరాంధ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ 2021లో జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకుందని చెప్పారు. 7 చోట్ల రెండవ స్థానంలో నిలిచిందన్నారు. అప్పటి పాలకుల వైఖరిని తట్టుకొని జనసేన పార్టీ బలంగా పోరాడింది నిలబడిందన్నారు నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే మొట్టమొదట స్పందించిన నాయకుడు పవన్ కళ్యాణ్, ఆ విషయం మరిచి పోవద్దన్నారు . ఆనాడు అధికారంలో లేక పోయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించారన్నారు. త్యాగాల పునాదుల మీద నిర్మించిన ఈ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో మాట్లాడి ప్రైవేటీకరణ జరపవద్దని కోరారన్నారు నాదెండ్ల మనోహర్.
