Deputy CM Pawan : అమరావతి – శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించి స్వయంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు ఫోటోలు, వీడియోలను విడుదల చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ను , తల్లిని ఉద్ధేశించి చేసిన కామెంట్స్ మరిచి పోక ముందే మరో టీడీపీ ఎమ్మెల్యే ఘటన చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఎలా అని ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
Deputy CM Pawan kalyan Slams TDP MLA
శ్రీశైలం అటవీ అధికారుల ఘర్షణపై దర్యాప్తునకు పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan) ఆదేశించారు . శాసనసభ్యుడి ప్రమేయంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఉద్యోగులు, శాసనసభ్యుడి అనుచరుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ కలకలం రేపింది. . జవాబుదారీతనం, నిబంధనలకు కట్టుబడి ఉండటంపై బాధ్యత వహించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాలని నేను స్పష్టంగా సూచించానని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఎమ్మెల్యే , అతని అనుచరులు అటవీ శాఖ అధికారులను కిడ్నాప్ చేసిన తర్వాత వారిపై దాడి చేశారు.
అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి)కి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బి. రాజశేఖర రెడ్డి , అతని అనుచరులు మంగళవారం అర్థరాత్రి శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోని మార్కాపురం డివిజన్‌లో భాగమైన నెక్కంటి ఫారెస్ట్ రేంజ్ అధికారులపై దాడి చేశారని ఆరోపించారు.
Also Read : TVK Vijay Important Meeting : టీవీకే సమావేశానికి సర్వం సిద్ధం
