AP Cyclone : అమరావతి – ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా (Odisha) వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు, మత్స్య కారులు అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు.
AP Cyclone Sensational – Red Alert Announced
రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకించి వేటకు వెళ్లే మత్స్యకారులు సాధ్యమైనంత మేర కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటే మంచిదని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు ప్రఖర్ జైన్, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 77 మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిమీ, భీమవరంలో 67.5 మిమీ, విజయవాడ పశ్చిమలో 62.5 మిమీ, విజయవాడ సెంట్రల్ లో 62 మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Also Read : Heavy Rains Sensational – Trains Cancel : కుండపోత వర్షాలతో తెలంగాణలో పలు రైళ్లు రద్దు
