Heavy Rains : రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షాల (Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్‌లపై వరద నీరు నిలిచిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు.
Heavy Rains – రద్దైన రైళ్లు
బుధవారం రద్దు:
- కరీంనగర్ – కాచిగూడ
- కాచిగూడ – నిజామాబాద్ (77643)
- మెదక్ – కాచిగూడ (57302)
- కాచిగూడ – మెదక్ (77603)
- ఆదిలాబాద్ – తిరుపతి (17406)
గురువారం రద్దు:
- మెదక్ – కాచిగూడ (77604)
- బోధన్ – కాచిగూడ (57414)
- నిజామాబాద్ – కాచిగూడ (77644)
అదనంగా, మహబూబ్‌నగర్ – కాచిగూడ, షాద్‌నగర్ – కాచిగూడ రైళ్లు తాత్కాలికంగా రద్దయ్యాయి.
దారి మళ్లించిన రైళ్లు
- 17663 రాయచూర్ – పర్బాని ఎక్స్‌ప్రెస్ : వికారాబాద్ – పర్లి వైజ్యనాథ్ – పూర్ణ మీదుగా
- 17664 నాందేడ్ – రాయచూర్ ఎక్స్‌ప్రెస్ : నాందేడ్ – పూర్ణ – పర్లి వైజ్యనాథ్ – వికారాబాద్ మీదుగా
- 17063 మన్మాడ్ – కాచిగూడ (అజంతా ఎక్స్‌ప్రెస్) : పర్బాని – పర్లి వైజ్యనాథ్ – వికారాబాద్ – సికింద్రాబాద్ మీదుగా
- 07054 బికనీర్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ : పూర్ణ – పర్బాని – పర్లి వైజ్యనాథ్ – వికారాబాద్ – సికింద్రాబాద్ మీదుగా
- 17019 హిసార్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ : పర్బాని – పర్లి వైజ్యనాథ్ – వికారాబాద్ – హుస్సేన్ సాగర్ జంక్షన్ – హైదరాబాద్ దక్కన్ మీదుగా
మరిన్ని రద్దులు అవకాశం
కామారెడ్డి – బికనూర్ – తలమడ్ల, అకన్పేట్ – మెదక్ మార్గాల్లో ట్రాక్‌లపై వరద ప్రవహిస్తోంది. ఈ కారణంగా రాబోయే గంటల్లో మరిన్ని రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Also Read : Indian Economy Interesting : 2038 వ సంవత్సరానికి ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా భారత్
