AP Cabinet : అమరావతి : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కీలక అంశాలపై సమీక్షించిన మంత్రివర్గం (AP Cabinet) ప్రధానంగా బిలియన్ డాలర్లను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేసింది. ఈమేరకు అమరావతిలోని సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, వంగలపూడి అనిత, నాదేండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ , అనగాని సత్యప్రసాద్ , నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ , ఉన్నతాధికారులు హాజరయ్యారు.
AP Cabinet Approved
ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 14, 15 వ తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఐఐ సదస్సును విశాఖపట్నం నగరం వేదికగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యం గా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 5 వేల మంది నిపుణులు, స్టార్టప్ లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : Minister Parthasarathy Interesting Update : జర్నలిస్టుల కోసం మీడియా రిలేషన్స్ పోర్టల్
