Minister Parthasarathy Interesting Update : జ‌ర్న‌లిస్టుల కోసం మీడియా రిలేష‌న్స్ పోర్ట‌ల్

ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థ‌సార‌థి

Hello Telugu - Minister Parthasarathy Interesting Update

Hello Telugu - Minister Parthasarathy Interesting Update

Minister Parthasarathy : అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు తీపిక‌బురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు 2026-2027 రెండేళ్ళ కాల పరిమతితో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్( వైబ్ సైట్)ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి (Minister Parthasarathy) లాంచనంగా ప్రారంభించారు. ఈమేరకు ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్ సైట్ ను సమాచారశాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ తో క‌లిసి ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Minister Parthasarathy Comments

గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపధ్యంలో రానున్న 2026-2027 రెండేళ్ల కాలానికి నూతన అక్రిడిటేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోందని తెలిపారు మంత్రి. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ల కోసం అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకునేందుకు దీనిని రూపొందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కొలుసు పార్థ‌సార‌థి. ఈ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో కూడా ఈవైబ్ సైట్ ద్వారా తెల్సుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ పోర్టల్ లో ఏవిధంగా ధరఖాస్తు చేసుకోవాలనే విధి విధానాలను ఇవాళ తెలియ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Minister Nimmala Clear Update : శంక‌ర‌గుప్తం డ్రైన్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం

Exit mobile version