వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి : హైకోర్టు

స‌మాజం కంటే ప్రాణం విలువైన‌ద‌ని ప్ర‌క‌ట‌న

hellotelugu-DelhiHighCourt

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కోరుతూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త కొన్ని రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, సామాజిక‌, ప్ర‌జా కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఢిల్లీ హైకోర్టు కీల‌క కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్రాణం విలువైనదని, వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాల‌ని స్ప‌ష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నందున, ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని హైకోర్టు అధికారులను గురువారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ , న్యాయమూర్తి తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్రాణం చాలా విలువైనదని నొక్కి చెబుతూ, ప్రభుత్వ వైద్యులతో వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించాలని పేర్కొంది. కేంద్రం , ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజర‌య్యారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచార‌ణ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం వ్యక్తి ప్రాణం విలువైనదేనని అని పేర్కొంది. వాంగ్‌చుక్‌కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు మెహ‌తా. ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదేనని, దానిని కాపాడటానికి ప్రభుత్వ అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలని మేము భావిస్తున్నాము” అని కోర్టు పేర్కొంది.

Exit mobile version