ఆగ‌స్టు నెల‌లో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

hellotelugu-BhoggapuramAirport

న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి తీపి క‌బురు చెప్పారు కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి కింజారపు రామ్మోహ‌న్ నాయుడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఆగ‌స్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర హోం శాఖ కీలక గుర్తింపునిస్తూ, దీనిని ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025’ పరిధిలోకి చేర్చింద‌ని చెప్పారు. ఇందుకు గాను ఇవాళ కీల‌క అప్ డేట్ ఇచ్చారు కేంద్ర మంత్రి. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరామని, ఆయన తేదీని ఖరారు చేయగానే ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ సంద‌ర్బంగా గ‌రువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఉడాన్-2.0’ (Udaan-2.0) వర్క్‌షాప్‌లో పాల్గొన‌డం జ‌రిగింద‌ని తెలిపారు. భోగాపురం ఎఎయిర్ పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమ‌తి కోసం నిరీక్షిస్తున్నామ‌ని, ఆయ‌న ఓకే చెబితే త‌క్ష‌ణ‌మే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. భోగాపురం విమానాశ్రయం ఇప్పుడు ‘కేటగిరీ-1’ విమానాశ్రయాల జాబితాలో చేర్చడం జ‌రిగింద‌న్నారు. 39వ స్థానంలో నిలిచింది. ఈ నోటిఫికేషన్ భోగాపురం విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా పని చేయడానికి కూడా సహాయ పడుతుంద‌ని తెలిపారు. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు పేర్కొన్నారు.

Exit mobile version