KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఓటర్ జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. గురువారం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామ స్థాయిలోనే పరిశీలించాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు . ఎమ్మెల్సీలు ఎల్ రమణ, డా. దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంఛార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
KTR Key Comments
ఓటర్ జాబితాలో ఏమన్నా అక్రమాలు, అవకతవకలు జరిగితే ఈ కమిటీ దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీఆర్ఎస్ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశ పూర్వకంగా తొలగించే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఓటర్ జాబితాలో పేరు లేని వారు తమ అభ్యంతరాలను చెప్పుకోవడానికి తక్కువ గడువు విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు కేటీఆర్. ఈ రోజు నుంచే గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితా తయారీ ప్రారంభమవుతుందని, ఈనెల 29న జిల్లా స్థాయిలో, 30వ తేదీ నుంచి మండలస్థాయిలో ఎన్నికల సంఘం అధికారులతో రాజకీయ పార్టీల సమావేశాలు జరుగుతాయని ఆయన వివరించారు.ఈ సమావేశాలకు పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేదా పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు.
Also Read : MLA Harish Rao Fired on Congress Govt : ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది – హరీశ్ రావు
