BJP Chief Madhav : ఢిల్లీ – అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై విధించిన టారిఫ్ ల వల్ల ఏపీకి చెందిన ఆక్వా రైతులు తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. శుక్రవారం మర్యాద పూర్వకంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతుల ఇబ్బందులు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పీవీఎన్ మాధవ్ (BJP Chief Madhav). ప్రస్తుతం ఆక్వా రైతులకు నష్టం కలుగుతోందని అన్నారు.
AP BJP Chief Madhav Key Comments
ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఏపీలో పార్టీ అభివృద్ధిపై రోడ్ మ్యాప్‌ను ప్రధానికి వివరించానని వెల్లడించారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. వైసీపీకి కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు బీజేపీ చీఫ్. వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూకేటాయింపుల్లో ఒక విధానం ఉందన్నారు. గతంలో కొన్ని సంస్థలకు రాయితీలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఒక విధానం ఉన్నందున భూ కేటాయింపుల్లో ఎలాంటి పక్షపాతం లేదన్నారు.
ట్రంప్ టారిఫ్ ల వలన ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించానని చెప్పారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకొనివెళ్లానని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ బలోపేతానికి రూపొందించిన రోడ్ మ్యాప్ పై సలహాలు, సూచనలను తీసుకోవడం జరిగిందన్నారు.
Also Read : YS Sharmila Fired on NDA Govt : వైఎస్ఆర్ విగ్రహాలపై కక్ష ఎందుకు..?
