AP Biodiversity Chairman Vijay : అమరావతి : పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వందల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు స్వాహా చేశారని సంచలన ఆరోపనలు చేశారు ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ కుమార్ (AP Biodiversity Chairman Vijay). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరి గురించి ఇటీవల కోర్టు కూడా పేర్కొందన్నారు. స్వాహా చేసిన విషయంపై రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్నారు. టీటీడీ సొమ్ము కాజేసిన దానిపై హైకోర్టు కూడా మొట్టి కాయలు వేసిందన్నారు. మూసేసిన ఆ కేసును తిరిగి ప్రారంభించాలని ఆదేశించిందన్నారు. భక్తులు ఎంతో భక్తితో వేసే కానుకల డబ్బులు, డాలర్లు, బంగారం ఇతరత్రా వాటిని దొంగతనంగా గత 15 సంవత్సరాలుగా మాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
AP Biodiversity Chairman Vijay Slams YSRCP
ఈ కానుకలు కౌంటింగ్ లో కూర్చునే ఓ వ్యక్తి అప్పనంగా దోచేశాడని ఆరోపించారు విజయ కుమార్. ఇతన్ని పట్టుకొని శిక్ష వేయడం పోయి వైసీపీ నాయకులు వెనకేసుకు రావడం దారుణమన్నారు. వందల కోట్లల్లో టీటీడీ డబ్బు దోచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద జియంగార్ మఠం నుంచి ఒక గుమాస్త పరకామణిలో పాల్గొని దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇతని పేరు రవి కుమార్ అని, కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఖరీదైన ఇళ్లు, చెన్నై మొదలుకొని విజయవాడ, తిరుపతిలలో కొన్నాడని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఏం చేసినా పాపం లేదన్నారు, ఇలాంటి వారిని జైల్లో పెట్టి శిక్షించాలి. కాని అప్పటి వైకాపా కు చెందిన ఇద్దరు చైర్మన్లు, బోర్డు సభ్యులు, ఈవో ధర్మారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి లు కలిసి అండగా నిలిచారని ఆరోపించారు విజయ కుమార్. వీరంతా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారని ధ్వజమెత్తారు. తీగ లాగితే డొంకంతా కదులుతోందన్నారు విజయ కుమార్.
Also Read : Minister Dharmendra Pradhan Fired on DMK Govt : తమిళనాడు సర్కార్ పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్

















