Anupama : చెన్నై : ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ వాపోయింది. దీంతో అభ్యంతరకరమైన రీతిలో వీటిని వాడుతున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. దీనిపై ఆమె సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama). ఎవరని చూస్తే ఈ పని చేస్తున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయి అని తెలిసి తాను షాక్ కు గురైనట్లు చెప్పింది నటి.
Anupama Parameswaran Approach Police Station
సదరు అమ్మాయి ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్లు సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ పరమేశ్వరన్. మార్ఫ్ చేసిన ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ప్రతిష్టను దెబ్బ తీసిందని అనుపమ తెలిపారు. సదరు అమ్మాయిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యన నటీ నటులను టార్గెట్ చేస్తూ ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు తీస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. మరో వైపు కావాలని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తు్నారంటూ నటులు వాపోయారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ధైర్యంగా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీయడం అభినందనీయం.
Also Read : Peddi Movie – Chikri Song Sensational : పెద్ది చిక్రీ సాంగ్ సెన్సేషన్ చెర్రీ డ్యాన్స్ వైరల్
