Peddi Movie – Chikri Song Sensational : పెద్ది చిక్రీ సాంగ్ సెన్సేష‌న్ చెర్రీ డ్యాన్స్ వైర‌ల్

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట

Hello Telugu - Peddi Movie - Chikri Song Sensational

Hello Telugu - Peddi Movie - Chikri Song Sensational

Peddi : హైద‌రాబాద్ : ఒకే ఒక్క సినిమాతో త‌న రేంజ్ ఏమిటో చెప్పేసిన బుచ్చిబాబు స‌న మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా , జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా తెర‌కెక్కించాడు పెద్ది (Peddi) మూవీని. ఇప్ప‌టికే దాదాపు సినిమా షూటింగ్ పూర్త‌యింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్బంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా క‌న్ ఫార్మ్ కూడా చేశాడు. ఇది ప‌క్క‌న పెడితే రోజు రోజుకు అంచ‌నాలు పెరిగి పోతున్నాయి పెద్ది మూవీ మీద‌. బుచ్చిబాబు స‌న దీనిని పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, గ్లింప్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎక్క‌డ చూసినా మెగా ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేసేస్తున్నారు.

Peddi Movie Chikri Song Sensational

తాజాగా పెద్ది మూవీ కోసం అద్బుతంగా స్వ‌రాలు కూర్చాడు అల్లా ర‌ఖా రెహ‌మాన్. ఈ మేర‌కు చిక్రీ పేరుతో రిలీజ్ చేసిన సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ప్రత్యేకించి డ్యాన్స్ మాస్ట‌ర్ ఇచ్చిన స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి. ఈ సినిమాలో చెర్రీతో పాటు జాన్వీ క‌పూర్, శివ రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, ద్వివేందు శ‌ర్మ న‌టించారు. ఇక పెద్దిలోని చిక్రీ పాట‌ను బాలాజీ రాశాడు. దీనిని మోహిత్ చౌహాన్ పాడాడు. ఈ పాట‌ను తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హందీ, త‌దిత‌ర భాష‌ల‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ సాంగ్. మ‌రోసారి బిగ్ హిట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : Prashant Kishor Shocking Comments : బీహార్ లో నితీష్ కమార్ కు షాక్ త‌ప్ప‌దు

Exit mobile version