హైదరాబాద్ : . తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా సినీ పరిశ్రమ అంతటా అభిమానులు ప్రత్యేక అప్‌డేట్‌లు , శుభాకాంక్షలతో వేడుకలు జరుపుకున్నారు. ‘వారణాసి’ చిత్ర బృందం ప్రత్యేకమైన స్టిల్స్‌ను విడుదల చేసినప్పటికీ, ఒక ప్రత్యేకమైన శుభాకాంక్ష అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏమిటంటే పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడిగా పేరు పొందిన సందీప్ రెడ్డి వంగా దీనిని రూపొందించారు; ఆయన ఏఐ (కృత్రిమ మేధస్సు) సాంకేతికతను ఉపయోగించి ‘కిరాయి కోటిగాడు’ చిత్రంలోని కృష్ణ గారి ప్రసిద్ధ డైలాగ్‌ను మహేష్ బాబు రూపంతో పునః సృష్టించారు. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది .
దీంతో రాబోయే కాలంలో వీరిద్దరి కలయికలో చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. సందీప్ రెడ్డి వంగా, మహేష్ బాబుతో కలిసి రూపొందించ బోతున్నట్లుగా భావిస్తున్న ‘డెవిల్’ ప్రాజెక్ట్ గురించి ఈ పోస్ట్ మరోసారి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రాన్ని, సందీప్ ‘స్పిరిట్’ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా కార్యరూపం దాల్చుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా వంగా సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండతో కలిసి మహంకాళి ఆలయాన్ని కూడా సందర్శించారు. వారిద్దరూ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తను తొలి సినిమాను దేవరకొండతో కలిసి అర్జున్ రెడ్డి తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇదే మూవీని హిందీలో తీశాడు. అక్కడ బిగ్ హిట్. తర్వాత యానిమల్ తీశాడు. ఇది ఇండియాను షేక్ చేసింది.
