Deputy CM Pawan Shocking Case : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై క్ర‌మిన‌ల్ కేసు

బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లైపై కూడా

Hello Telugu - Deputy CM Pawan Shocking Case

Hello Telugu - Deputy CM Pawan Shocking Case

Deputy CM Pawan : త‌మిళ‌నాడు – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై త‌మిళ‌నాడులో పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. ప‌వ‌న్ తో పాటు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లైపై కూడా కేసు న‌మోదైంది. జూన్ 22న మ‌ధురై వేదిక‌గా మురుగ‌న్ భ‌క్తుల స‌ద‌స్సు జ‌రిగింది. నిర్వాహ‌కుల‌కు షాక్ ఇచ్చారు అన్నాన‌గ‌ర్ పోలీసులు. రాజకీయ, మతపరమైన వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే మ‌ద్రాస్ హైకోర్టు స్ప‌ష్టం చేసింద‌ని, కానీ కావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan), అన్నామ‌లైలు ఉద్రిక్త‌త‌లు రెచ్చ‌గొట్టేలా కామెంట్స్ చేశారంటూ మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ న్యాయవాది, సమన్వయకర్త ఎస్. వంజినాథన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

Deputy CM Pawan Kalyan – Criminal Case

మురుగ‌న్ స‌ద‌స్సులో చేసిన ప్ర‌సంగాలు, తీర్మానాలు మ‌త ప‌రంగా వైరాన్ని మ‌రింత రెచ్చ గొట్టేలా ఉన్నాయ‌ని, మతపరమైన, రాజకీయ సందేశాలపై కఠినమైన పరిమితులతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించారంటూ ఆరోపించారు.

కేసు – క్రైమ్ నం. 497/2025 – భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్లు 196(1)(ఎ), 299, 302, 353(1)(బి)(2) కింద నమోదు చేయబడింది. పేరున్న నిందితులలో హిందూ మున్నాని అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం, రాష్ట్ర కార్యదర్శి పవన్ కళ్యాణ్, అన్నామలై, RSS, BJP, హిందూ మున్నాని, అనుబంధ సంఘ్ పరివార్ గ్రూపుల గుర్తు తెలియని ఆర్గనైజింగ్ సభ్యులు ఉన్నారు.

Also Read : TG High Court Shocking Comments : సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ ఠాణాలు

Exit mobile version