Anil Antony – India Growth : మూడేళ్ల‌లో 5 ట్రిలియ‌న్ ఎకాన‌మీగా భార‌త్

బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి అనిల్ ఆంటోనీ

Hello Telugu - Anil Antony - India Growth

Hello Telugu - Anil Antony - India Growth

Anil Antony : విజ‌య‌వాడ : రాబోయే మూడు సంవ‌త్స‌రాల‌లో భార‌త దేశం ప్ర‌పంచం నివ్వెర పోయేలా 5 ట్రిలియ‌న్ ఎకాన‌మీగా మారుతుంద‌ని జోష్యం చెప్పారు బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి అనిల్ ఆంటోనీ (Anil Antony). సోమ‌వారం ఏపీలోని విజ‌య‌వాడ‌లో జ‌రిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టేట్ లెవెల్ స్టూడెంట్ మీట్ కు హాజ‌రై ప్ర‌సంగించారు. ఆయ‌న‌ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కో కన్వీనర్గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌ధాన‌మంత్రికి రానంత ప్ర‌చారం మోదీకి మాత్ర‌మే వ‌చ్చింద‌ని అన్నారు. ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా పేరు పొందార‌ని చెప్పారు. గ‌తంలో నాలుగు స్లాబ్ జీఎస్టీ రేట్స్ ఉండేవ‌ని కానీ మోదీ సూచ‌న‌ల మేర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చలా వాటిని రెండు స్లాబ్ ల‌కు ప‌రిమితం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 99 శాతం వ‌స్తులు పేద‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌న్నారు.

Anil Antony Key Comments on India’s Growth

దీని కార‌ణంగా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గింద‌న్నారు. దీని కార‌ణంగా దేశ ఆర్థిక వృద్ది మ‌రింత పెర‌గుతుంద‌న్నారు. సామాన్యుడి అవసరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. జీడీపీ ని అభివృద్ధి చేసే నిర్ణయం మోదీ తీసుకున్నారని పేర్కొన్నారు అనిల్ ఆంటోనీ. బిజెపి (BJP) ఏర్పాటు అయిన నాటి నుంచీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను సమర్ధించిందని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వలన 1.5 శాతం వరకూ జీడిపి పెరుగుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించగలం అన్నారు. మోదీ నేతృత్వంలో చాలా విద్యా సంస్ధలు పెరిగాయన్నారు. విద్యకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు లాంటి వాటిపై జీఎస్టీ లేదన్నారు. ప్రతీ విద్యార్ధికి క్వాలిటీ విద్య అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు. బిజెపి సీనియర్ నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ వేటుకూరి సూర్య నారాయణ రాజు, మిట్టా వంశీ, బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మాల్యాద్రి యాదవ్, నాగోతు హరికృష్ణ, కొండా నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : PM Kisan Interesting Update : పీఎం కిసాన్ 21వ వాయిదా పై కేంద్రం కీలక అప్డేట్

Exit mobile version