Amreen Gets Ganesh Laddu Interesting : గ‌ణేశ్ ల‌డ్డూని చేజిక్కించుకున్న ముస్లిం మ‌హిళ

నిర్మ‌ల్ పట్ట‌ణానికి చెందిన అమ్రీన్ సంచ‌ల‌నం

Hello Telugu - Amreen Gets Ganesh Laddu Interesting

Hello Telugu - Amreen Gets Ganesh Laddu Interesting

Ganesh : నిర్మ‌ల్ జిల్లా : హిందూవులు ఎక్కువ‌గా పూజించే పండుగ‌ల‌లో వినాయ‌క (Ganesh) చవితి ఒక‌టి. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా వినాయ‌కుల‌ను ప్ర‌తిష్టించారు. భారీ ఎత్తున నిమ‌జ్జనం కూడా నిర్వ‌హించారు. ఒక్క హైద‌రాబాద్ న‌గరంలోనే ఏకంగా రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా విగ్రహాలు కొలువు తీర‌డం విశేషం. భారీ ఎత్తున ఖైర‌తాబాద్ లో ఏర్పాటు చేసిన 72 అడుగుల గ‌ణ‌నాథుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఇక దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా రాజేంద్ర న‌గ‌ర్ లోని రిచ్ మండ్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన వినాయ‌కుడి ల‌డ్డూ వేలం పాట‌లో ఏకంగా రూ. 2. 32 కోట్ల‌కు అమ్ముడు పోయింది. ఇదే స‌మ‌యంలో పేరు పొందిన బాలాపూర్ ల‌డ్డూను క‌ర్మ‌న్ ఘాట్ కు చెందిన బీజేపీ నేత గౌడ్ రూ. 34 ల‌క్ష‌ల‌కు కైవ‌సం చేసుకున్నాడు. ఇదిలా ఉండ‌గా ప‌లు చోట్ల మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచింది ఈ పండుగ‌.

Muslim Lady Amreen Gets Ganesh Laddu

తాజాగా తెలంగాణ‌లోని నిర్మ‌ల్ జిల్లా లోని నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇక్క‌డ ఏర్పాటు చేసిన వినాయ‌కుడి ల‌డ్డూ వేలం పాట‌లో ముస్లిం కుటుంబం పాల్గొంది. ఏకంగా రూ. 1.88 ల‌క్ష‌ల‌కు స‌ద‌రు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని కైవ‌సం చేసుకుంది అమ్రీన్ అనే మ‌హిళ‌. ఈ సంద‌ర్బంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. స్వామి వారి ప్ర‌సాదం ద‌క్క‌డం త‌న‌కు మ‌రింత సంతోషాన్ని క‌లిగించేలా చేసింద‌ని చెప్పింది. వినాయ‌కుడిని ప‌ట్ట‌ణంలోని ఈద్గా ఆద‌ర్శ్ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. ఆమె మ‌త ప‌ర‌మైన ఐక్య‌త‌కు స‌ద‌రు మహిళ కేరాఫ్ గా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాగా ల‌డ్డూను కైవ‌సం చేసుకున్న అమ్రీన్ ను ప్ర‌త్యేకంగా అభినందించింది హిందూ స‌మాజం.

Also Read : India Thrashes China Sensational : ఆసియా క‌ప్ హాకీ ఫైన‌ల్ లో భార‌త్

Exit mobile version