టోక్యోలో సంద‌డి చేసిన అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా

పుష్ప -2 సీక్వెల్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు

hellotelugu-Pushpa-2

జ‌పాన్ : జ‌పాన్ లో యంగ్ సినీ హీరో అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప -2 సీక్వెల్ మూవీ రికార్డుల మోత మోగించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ ఆద‌ర‌ణ చూర‌గొంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో దీనిని నిర్మించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో రెండో అతి పెద్ద క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. పుష్ప -2 అనుకోని రీతిలో రూ. 1784 కోట్లు వ‌సూలు చేసింది. ఇంకా జ‌నాద‌ర‌ణ పొందుతోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌పాన్ లో బ‌న్నీ క్రేజ్ మ‌రింత పెరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా పుష్ప -2 సినిమాను గ్రాండ్ గా రీ లాంచ్ చేశారు. త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

టోక్యో లోని భారీ థియేట‌ర్ వ‌ద్ద పుష్ప -2 మూవీ హ‌ల్ చ‌ల్ చేసింది. అంత‌కు ముందు ఇందులో న‌టించిన , కీ రోల్ పోషించిన పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సంద‌డి చేశారు. అభిమానుల‌ను అల‌రించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. హుషారు తెప్పించేలా మ్యూజిక్ అందించాడు రాక్ స్టార్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్. బ‌న్నీ త‌న ఐకానిక్ డైలాగ్ ల‌లో ఒక దానిని జ‌ప‌నీస్ భాషలో చెప్పి ఫ్యాన్స్ ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌ను చెప్పిన‌ తీరుకు ప్రేక్షకుల నుండి విస్తృత ప్రశంసలు, స్టాండింగ్ ఒవేషన్ లభించాయి. శుక్ర‌వారం జ‌పాన్ అంత‌టా కీల‌క టాకీస్ ల‌లో పుష్ప‌-2 గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Exit mobile version