Allu Aravind : హైదరాబాద్ : ఎందుకనో ఈ ఏడాది అల్లు అర్జున్ కుటుంబానికి అచ్చొచ్చినట్టు లేదు. సుకుమర్ దర్శకత్వం వహించిన పుష్ప-2 ప్రిమీయర్ షో సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందడం, పలువురు గాయపడడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చివరకు బన్నీని ఒక రోజు జైలులో ఉంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఈ సందర్బంగా తను మైకు తీసుకుని పుష్ప లో తాను చెప్పిన పాపులర్ డైలాగ్ తగ్గేదే లే అంటూ చెప్పడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఇటీవలే అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి కనకరత్నమ్మ అనారోగ్యంతో కన్ను మూసింది.
Allu Aravind’s Allu Business Park Gets Notices
ఈ సమయంలో పలువురు ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నివాళులు అర్పిస్తున్నారు. ఈ దేశంలో డబ్బు, హోదా, పదవులను, పైసలను బట్టి పలకరించే పద్దతి మారుతూ ఉంటుందని తేలిపోయింది. ఇది పక్కన పెడితే తాజాగా అల్లు అరవింద్ (Allu Aravind) కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. జూబ్లీ హిల్స్ లో నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్ పై బల్దియా కన్నేసింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మించారంటూ నోటీసులు జారీ చేసింది. ఈ భవన సముదాయం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లోని తన వాణిజ్య సముదాయం ఉంది. అల్లు బిజినెస్ పార్క్‌లో అనధికార నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేసింది.
కాగా బల్దియా ప్రకారం కాంప్లెక్స్‌లో రెండు సెల్లార్లు, G+4 నిర్మాణం కోసం అనుమతి ఉంది. అయితే, ఇటీవల నాల్గవ అంతస్తులో అనుమతి లేకుండా అదనపు నిర్మాణ చేపట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసు ఇచ్చింది. అనధికార నిర్మాణానికి సంబంధించి సంజాయిషీ కోరింది. దానిని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది.
Also Read : ISIS Attack on Congo : కాంగోలో ఐసిస్ అనుచరుల దాడి – 60 మంది ప్రాణాలు హతం
