ISIS Attack on Congo : కాంగోలో ఐసిస్‌ అనుచరుల దాడి – 60 మంది ప్రాణాలు హతం

ఈ దాడిలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు...

Hello Telugu - ISIS Attack on Congo

Hello Telugu - ISIS Attack on Congo

ISIS : తూర్పు కాంగోలో ఐసిస్‌ అనుబంధ తిరుగుబాటు గ్రూపు రాత్రిపూట ఘోర దాడి జరిపింది. ఈ దాడిలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ISIS Shocking Attack

నార్త్‌ కివులోని న్టోయో గ్రామంలో అంత్యక్రియల కోసం చేరుకున్న ప్రజలపై అలైడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్స్‌ (ADF) దాడి చేసినట్లు సమాచారం. స్థానిక లుబెరో ప్రాంత పరిపాలకుడు కల్నల్‌ అలైన్‌ కివేవా మాట్లాడుతూ, “దాడిలో సుమారు 60 మంది మరణించారు. ఖచ్చితమైన సంఖ్యను సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తాం. అనేకమందిని నరికి చంపినట్లు సమాచారం” అన్నారు.

ఒక సాక్షి వివరాల ప్రకారం, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు దాదాపు 10మంది ఉన్నారని, వారు ప్రజలను ఒకే చోట కూడగట్టి మాచెట్లతో దాడి ప్రారంభించారని చెప్పారు. “వారి అరుపులు విన్నాను. తర్వాత నాకు స్పృహ కోల్పోయింది” అని ఆమె కన్నీటి పర్యంతమై చెప్పింది. భయంతో తన పేరు వెల్లడించకుండా ఉండాలని కోరింది.

ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని పరిశీలన చేపట్టినట్లు సమాచారం.

Also Read : NIA Raids Sensational : దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు – ఐసిస్‌ కుట్రపై విచారణ వేగం

Exit mobile version