CP Radhakrishnan Important Meet : ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీపీ రాధాకృష్ణ‌న్

ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన ఎన్డీఏ

Hello Telugu - CP Radhakrishnan Important Meet

Hello Telugu - CP Radhakrishnan Important Meet

CP Radhakrishnan : న్యూఢిల్లీ – భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్డీఏ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన సీపీ రాధాకృష్ణ‌న్ (CP Radhakrishnan) మ‌ర్యాద పూర్వ‌కంగా ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌కు వ‌చ్చాయి. మ‌రో వైపు ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ను ఏక‌గ్రీవంగా చేయాల‌ని బీజేపీ, హిందూ ప‌రివారం కోరుకుంటోంది. ఇప్ప‌టికే ఆయా పార్టీల‌తో, ప్ర‌తిప‌క్ష అధినేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుతోంది. ఇందులో భాగంగా వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి స్వ‌యంగా ఫోన్ చేశారు కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్ర‌స్తుతం మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో కూడా మాట్లాడారు. అయితే ఇండియా కూట‌మి మాత్రం ఒప్పు కోవ‌డం లేదు. ఉప రాష్ట్ర‌ప‌తి బ‌రిలో త‌మ కూట‌మి త‌ర‌పున అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

CP Radhakrishnan Meet PM Modi

ఇదిలా ఉండ‌గా త‌న‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధన్య‌వాదాలు తెలిపారు కేపీ రాధాకృష్ణ‌న్. ఇదిలా ఉండ‌గా త‌న స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు. ఆయ‌న అస‌లు పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ . అక్టోబ‌ర్ 20, 1957లో తిరుప్పూర్ లో పుట్టారు. 16 ఏళ్ల‌ప్పుడు ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1998 , 1999లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు, 2004, 2014, 2019లో పోటీ చేసి ఓటమి పొందారు. 2003–2006 తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఫిబ్రవరి 2023 నుంచి జార్ఖండ్ గవర్నర్‌గా విధులు చేపట్టారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్ర‌స్తుతం మ‌రాఠా గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతున్నారు.

Also Read : Chinta Mohan Shocking Comments : ఎన్నిక‌ల సంఘం నిర్వాకం ఓట్ల చోరీ నిజం

Exit mobile version