అజ‌య్ దేవ‌గ‌న్ హైద‌రాబాద్ పై ఫోక‌స్

అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు

hellotelugu-AjayDevagan

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ ఫుల్ ఫోక‌స్ పెట్టారు హైద‌రాబాద్ పై. ప్ర‌స్తుతం రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ సమ్మిట్ 2025కి శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్ర‌ముఖులంతా రానున్నారు. ఇందులో భాగంగా ఈ స‌మ్మిట్ కు హాజ‌రు కానున్నారు న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ .ల్యాండ్ మార్క్ ఫిల్మ్ సిటీ డీల్‌కు త‌ను సంతకం చేయనున్నారు. అజయ్ దేవగన్ ఒక ప్రధాన పెట్టుబడి చర్య కోసం హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకం చేయ‌నుంది. ఒకటి బాలీవుడ్ నటుడు ప్లాన్ చేసిన అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఉండ‌గా మ‌రోటి రిలయన్స్ గ్రూప్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం నైట్ సఫారీ కోసం ఏర్పాటు చేయ‌నుంద.

ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవగన్ ప్రభుత్వంతో తన ఒప్పందాన్ని అధికారికం చేసుకుంటారని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలో ప్రపంచ స్థాయి స్టూడియోను నిర్మించాలనే ఆసక్తిని తెలియజేశారు. చర్చలు సజావుగా సాగాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన నికర జీరో అర్బన్ హబ్‌గా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు సీఎం. ఈ దార్శనికతలో భాగంగా, ఫుడ్‌లింక్ తో పాటు ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా ప్ర‌తిపాదించారు.

Exit mobile version