Air India : ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులు ఇకపై మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ప్రత్యేక ఆఫర్లు పొందనున్నారు. ఈ సదుపాయాలు కేవలం దేశీయ ప్రయాణాలకే కాకుండా అంతర్జాతీయ రూట్లకూ వర్తించనున్నాయి.
Air India – ప్రధాన ఆఫర్లు
- బేస్ ఫేర్‌పై 10% డిస్కౌంట్ (వెబ్‌సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసినప్పుడు)
- ఒకసారి ఉచితంగా డేట్ మార్పు అవకాశం (ఫేర్ డిఫరెన్స్ ఉంటే మాత్రమే చెల్లించాలి)
- అదనంగా 10 కిలోల లగేజ్ లేదా ఒక అదనపు బ్యాగ్ తీసుకెళ్లే సౌకర్యం
- UPIPROMO కోడ్ ఉపయోగించి UPI ద్వారా చెల్లిస్తే రూ.2,000 వరకు అదనపు తగ్గింపు
లగేజ్ అలవెన్స్ (క్లాస్‌ను బట్టి)
- ఎకానమీ క్లాస్: 10 కిలోల అదనపు లగేజ్ (గరిష్టం 40 కిలోలు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 23 కిలోలు)
- ప్రీమియం ఎకానమీ: 10 కిలోల అదనపు లగేజ్ (గరిష్టం 45 కిలోలు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 23 కిలోలు)
- బిజినెస్ క్లాస్: 10 కిలోల అదనపు లగేజ్ (గరిష్టం 50 కిలోలు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 32 కిలోలు)
దేశీయ ప్రయాణాల కోసం ప్రత్యేక తగ్గింపులు
- బేస్ ఫేర్‌పై 25% డిస్కౌంట్
- UPIPROMO కోడ్ వాడి UPI పేమెంట్ చేస్తే రూ.200 అదనపు తగ్గింపు
- బ్యాగేజ్ అలవెన్స్ – 15 కిలోలు
డేట్ ఛేంజ్ & క్యాన్సిలేషన్ నిబంధనలు
- 3 రోజుల ముందుగా డేట్ మార్చుకుంటే ఉచితం
- 3 రోజుల ముందుగా క్యాన్సిల్ చేస్తే రూ.2,000, తరువాత అయితే రూ.3,500 ఫీజు
బుకింగ్ ప్రక్రియ
ప్రయాణికులు టికెట్ బుక్ చేసేటప్పుడు “Senior Citizen” ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ బుకింగ్ ఎయిర్ ఇండియా (Air India) వెబ్‌సైట్, యాప్, కాల్ సెంటర్ లేదా టికెట్ బుకింగ్ కార్యాలయాల ద్వారా చేయవచ్చు. వయస్సు రుజువు చేసే ఫోటో ID తప్పనిసరి. టికెట్ కొనుగోలు సమయంలో, చెక్-ఇన్ వద్ద, బోర్డింగ్ సమయంలో ఆ ID చూపించాలి. లేనిపక్షంలో బోర్డింగ్ అనుమతి ఇవ్వబడదు, పైగా టికెట్ విలువకు రెట్టింపు చార్జ్‌తో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : Today Gold Price : సామాన్య మానవుడికి అందని స్థాయిలో పసిడి ధరలు



















