Advocate Rakesh Shocking Comments : షూ విసిరినందుకు చింతించ‌డం లేదు

సీజేఐ వ్యాఖ్య‌ల కార‌ణంగానే దాడి చేశా

Hello Telugu - Advocate Rakesh Shocking Comments

Hello Telugu - Advocate Rakesh Shocking Comments

Advocate Rakesh : ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ (CJI BR Gavai) పై సుప్రీంకోర్టు ప్రాంగ‌ణంలో న్యాయ‌వాది రాకేష్ కిషోర్ షూ విసిరేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం రాకేష్ కిషోర్ జాతీయ మీడియా ఏఎన్ఐ తో మాట్లాడారు. తాను దాడి చేసేందుకు చింతించ‌డం లేద‌న్నారు. ఎక్క‌డా బాధ‌కు గురి కావ‌డం లేద‌ని పేర్కొన్నారు. త‌న దాడిని తాను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఖజురహో లోని జవారీ ఆలయంలో విష్ణువు నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ గ‌వాయ్ తోసి పుచ్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాకేష్ కిషోర్. ఈ సంద‌ర్బంగా విష్ణువుపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం త‌న‌ను మ‌రింత బాధ‌కు గురయ్యేలా చేసింద‌న్నాడు.

Advocate Rakesh Shocking Comments

గ‌త నెల‌ సెప్టెంబర్ 16న చీఫ్ జస్టిస్ కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.. జస్టిస్ గవాయ్ విగ్రహం తల పునరుద్ధరించడానికి వెళ్లి ప్రార్థించాలంటూ ఎగ‌తాళి చేశార‌ని ఆరోపించారు లాయ‌ర్. హల్ద్వానీలోని రైల్వే భూమి వంటి ఇతర మతాలపై కేసులు ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట వర్గం ఆక్రమించినట్లు మనం చూస్తున్నామన్నారు. దీనిని తొలగించడానికి ప్రయత్నించినప్పుడు, సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితం దానిపై స్టే విధించిందన్నారు. నూపుర్ శర్మ కేసులో కోర్టు మీరు వాతావరణాన్ని నాశనం చేశారంటూ తీర్పు చెప్పార‌ని మండిప‌డ్డారు. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు, అది జల్లికట్టు అయినా లేదా దహీ హండి విష‌యంలో మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు త‌న‌ను బాధ‌కు గుర‌య్యేలా చేసింద‌న్నారు. అందుకే దాడికి య‌త్నించాన‌ని చెప్పారు.

Also Read : CM Hemant Soren Shocking Comments : సీజేఐ గ‌వాయ్ పై దాడి అప్ర‌జాస్వామికం : సీఎం

Exit mobile version