CM Hemant Soren Shocking Comments : సీజేఐ గ‌వాయ్ పై దాడి అప్ర‌జాస్వామికం : సీఎం

హేమంత్ సోరేన్ సీరియ‌స్ కామెంట్స్ క‌ల‌క‌లం

Hello Telugu - CM Hemant Soren Shocking Comments

Hello Telugu - CM Hemant Soren Shocking Comments

CM Hemant Soren : జార్ఖండ్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ (CM Hemant Soren) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తాజాగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగ‌ణంలో భార‌త‌దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై ఓ న్యాయ‌వాది బూటు విసిరేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సీజేఐపై జ‌రిగిన ఈ దాడిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌న్నారు. త‌న‌పై జ‌రిగిన దాడి కాద‌ని ఇది పూర్తిగా భార‌త దేశ ప్ర‌జాస్వామ్యం ఆత్మ‌పై జ‌రిగిన దాడిగా భావించాల్సి ఉంటుంద‌న్నారు. దీనిని ఆయ‌న పిరికి చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. న్యాయవ్యవస్థ గౌరవం , స్వేచ్ఛ ఏ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కైనా మూల స్తంభం అని తెలిపారు సీఎం.

CM Hemant Soren Key Comments

సుప్రీంకోర్టు ప్రాంగ‌ణంలోకి కేసు విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ హాజ‌ర‌య్యారు. ఆ వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ న్యాయ‌వాది త‌న షూను విసిరి వేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. కోర్టు ప్రాంగ‌ణంలో పెద్ద అల‌జ‌డి చోటు చేసుకుంది. అక్క‌డికి హాజ‌రైన న్యాయ‌వాదులంతా విస్మ‌యానికి లోన‌య్యారు. కేసుల ప్రస్తావనను విచారిస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. న్యాయవాది ఎత్తైన వేదిక వద్దకు చేరుకున్నాడు. తన షూను తీసివేసి, న్యాయమూర్తుల వైపు విసిరేందుకు ప్రయత్నించాడు. కోర్టు గదిలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని దాడిని అడ్డుకున్నారు. న్యాయవాదిని త్వరగా కోర్టు ప్రాంగణం నుండి బయటకు తీసుకెళ్లారు. అత‌డిని బార్ నుండి స‌స్పెండ్ చేశారు.

Also Read : TTD Bhanu Prakash Reddy Fired on Bhumana : భూమ‌నా..తిరుమ‌ల‌పై దుష్ప్ర‌చారం త‌గ‌దు

Exit mobile version