Adluri Laxman : జగిత్యాల జిల్లా : మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman). ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయాలని తమ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని చెప్పారు. మహిళల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప చేసేలా సర్కార్ చెప్పటిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. మహిళా మణులకు చీరలను పంపిణీ చేశారు.
Minister Adluri Laxman Key Comments on Women Empowerement
తొలి విడతలో జగిత్యాల జిల్లాకు ఇప్పటి వరకు 1,89,715 చీరలు రావడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు చీరను అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మహిళలకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు 155 బస్సులను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. నెలకు రూ. 70 వేలు వస్తుందని చెప్పారు.
Also Read : CM Revanth Reddy Important Update : అధికారికంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు
