ఏపీలో త్వ‌ర‌లో ఆద‌ర‌ణ 3.0 ప‌థ‌కం అమ‌లు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి స‌విత

hellotelugu-AdharanaScheme3.0

అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని మంత్రి సవిత ప్ర‌క‌టించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో అత్యధికంగా బీసీలే లబ్ధిపొందుతున్నారని అన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్నారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రజల్లోకి ధైర్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు వెళ్లేలా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. త్వరలో ఆదరణ 3.0ను అమలు చేస్తామని మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందని సవిత తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానిదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. జగన్ లో మరో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. బీసీ రక్షణ చట్టంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, మంత్రి సవితకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు మంత్రి సవిత అన్న ఎన్టీఆర్, మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, పలు బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట్ గురుమూర్తి, నందం అబద్ధయ్య, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version