AP Liquor Scam : ఏపీ లిక్క‌ర్ స్కాం కేసులో నిందితుల‌కు బెయిల్

రూ. 3,200 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని విచార‌ణ

Hello Telugu - AP Liquor Scam

Hello Telugu - AP Liquor Scam

AP Liquor : అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఏపీ లిక్క‌ర్ (AP Liquor) స్కాం కేసుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ స్కాంలో నిందితులుగా ఉన్న ముగ్గురికి బెయిల్ మంజూరైంది. రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో విచార‌ణ సంస్థ అదుపులోకి తీసుకుంది. కాగా ముగ్గురు వ్యక్తులు కోర్టు నుండి బెయిల్ పొందిన ఒక రోజు తర్వాత ఆదివారం ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. గత వైఎస్ఆర్సిపి పాలనలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డ, బాలాజీ గోవిందప్ప ల‌కు ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

AP Liquor Updates

రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో వైసీపీ పాల‌న‌లో చోటు చేసుకున్న స్కాంల‌కు సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో ప్రధాన‌మైన‌ది ఏపీ లిక్క‌ర్ స్కాం. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) గ‌త మే 16న ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలను అరెస్టు చేసింది. వీరి విచార‌ణ అనంత‌రం బాలాజీ గోవిందప్పను మే 13న మైసూరులో అదుపులోకి తీసుకున్నారు. త‌ను చిక్క‌కుండా చెక్కేశాడు. చివర‌కు ట్రేసింగ్ ద్వారా క‌ర్ణాట‌క‌లో ఉన్న‌ట్టు గుర్తించారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వీరి విడుదలను ఉద్దేశ పూర్వకంగా కొన్ని గంటలు ఆలస్యం చేశారని ఆరోపించారు.

Also Read : CM Revanth Reddy New Innovation : రేపే కీల‌క ప్రాజెక్టుల‌కు సీఎం శంకుస్థాప‌న

Exit mobile version