చీఫ్ ఇంజ‌నీర్ బాలు నాయ‌క్ ఇళ్ల‌ల్లో సోదాలు

భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు

hellotelugu-AcbRaids

హైద‌రాబాద్ : ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి ప‌రుల‌కు కోలుకోలేని షాక్ ఇస్తోంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో చీఫ్ ఇంజనీర్ గా ప‌ని చేస్తున్న‌ జే. బాలు నాయక్ నివాసాల్లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఏసీబీ సోదాలు చేపట్టింది. మాదాపూర్ లోని నివాహం సహా ఆయన ఆస్తులకు సంబంధించి తమకు వచ్చిన సమాచారంతో మొత్తం 11 చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేప‌ట్టారు. బాలు నాయక్ పై ఎప్పటినుండో అవినీతి, అక్ర‌మాల‌ ఆరోపణలు ఉన్నాయి.. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమీషన్ వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు అందాయి అవినీతి నిరోధ‌క శాఖ‌కు.

టెండర్లకు విరుద్ధంగా నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈయన అవినీతి వ్యవహారాలు.. తన కిందిస్థాయి అధికారులు సిబ్బందితో కలిసి ఏ విధంగా వసూళ్ల దందా నడిపిస్తున్న‌ట్లు బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా తన అనుచర వర్గాన్ని ఏర్పరచుకుని వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. స్వయంగా అమాత్యులు ఆదేశాలిచ్చినా.. శాఖలో మోహన్ నాయక్ ను ప్రసన్నం చేసుకోకుండా పని జరగదనేది డిపార్ట్మెంట్ లో ఒక బలమైన ప్ర‌చారం కూడా ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అవినీతి దందా నడిపిస్తున్న నాయక్ ఇప్పటికే తరతరాలకు సరిపోయేంత ఆస్తులు కూడబెట్టిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

Exit mobile version