ఏబీఎన్ రాధాకృష్ణ కామెంట్స్ నాగేశ్వ‌ర్ సీరియ‌స్

ఆయ‌న త‌న‌పై రాసిన‌వ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలేన‌ని ఫైర్

hellotelugu-professorNageshwarRao

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు నిప్పులు చెరిగారు. ఏబీఎన్ , ఆంధ్ర‌జ్యోతి ఓన‌ర్ , ఎడిట‌ర్ రాధాకృష్ణ త‌న గురించి వీకెండ్ కామెంట్ పేరుతో ప‌చ్చి అబ‌ద్దాలు రాశారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఒక బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తిగా, అన‌లిస్ట్ గా తాను స్పందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. నాగేశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈసారి ఏబీఎన్ రాధాకృష్ణ వ్య‌క్తిగ‌తంగా త‌న గురించే ప్ర‌స్తావించ‌డం విస్తు పోయేలా చేసింద‌న్నారు. తన ‘వీకెండ్ కామెంట్’ పూర్తిగా నా గురించే రాశారు. ఆయన లేవనెత్తిన మొదటి అంశం ఏమిటంటే తాను సీపీఎం సానుభూతిప‌రుడిన‌ని పేర్కొన‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. నేను ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 40 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్లేషణలు అందిస్తున్న నా గురించి వేరొకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఇన్నేళ్ల‌లో నేను కానీ, నా రంగులు గానీ, అభిప్రాయాలు గానీ మార్చు కోలేదన్నారు. నా అభిప్రాయాన్ని ఎప్పుడూ స్పష్టంగానే చెబుతూ వచ్చాను, ఇక ముందూ అలాగే చెబుతాను. వారు తమకు నచ్చిన కోణంలో చూసుకోవచ్చు, ఎవరికైనా ఎలాంటి సర్టిఫికెట్లయినా ఇవ్వొచ్చు. దానికి నాకేమీ అభ్యంతరం లేదు .కానీ ఇందులో ఆసక్తికరమైన రాజకీయ కోణం ఏమిటంటే, రాధాకృష్ణ నన్ను సీపీఎం సానుభూతిపరుడిగా అభివర్ణిస్తున్నప్పుడు, కొన్ని రాజకీయ పార్టీలు నా ఫోటోకు వైసీపీ కండువా కట్టి తమ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పెట్టిన చర్యను ఆయన ఖండించి ఉండాల్సింది. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. ఆయన వైసీపీ కాదు, సీపీఎం అని వారు చెప్పి ఉండాల్సింది. కానీ ఆ మాట ఎక్కడా రాలేదు. సోము వీర్రాజు మాత్రం ఆ మాట అన్నారు. “మీరు వైసీపీ కాదు, వామపక్ష భావజాలం కలవారు అని ఆయన అన్నారు. ఒకవేళ సోము వీర్రాజు అలా అంటే, ఆయనను నక్సలైట్ అనో, ఉగ్రవాది అనో అంటారు కదా.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను వామపక్షవాదినో లేదా సీపీఎంకు చెందిన వాడినో అయితే జ‌గ‌న్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉండదన్నారు. సీపీఎం ఒక రాజకీయ పార్టీ. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోకూడదు అనే విషయాలను ఆ పార్టీ ఎప్పుడూ రహస్యంగా చేయలేదు. నా వరకు చూస్తే, వారు బహిరంగంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఒక స్థిరమైన రాజకీయ విధానం ఆధారంగానే అలా చేశారు. 2009లో TDPతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, తమ పనులను రహస్యంగానో లేదా పరోక్షంగానో చేయవు. అవి బహిరంగంగానే వ్యవహరిస్తాయి. ఒకవేళ వారు ఏదైనా చేస్తే, “ఇదే మా రాజకీయ విధానం” అని స్పష్టంగా చెబుతారు.

2004లో 60 మందికి పైగా కమ్యూనిస్ట్ ఎంపీలు గెలిచారు. వారిలో 99 శాతం మంది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే గెలిచారు. కానీ ఆ సమయంలో, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) అధికారంలోకి రాకూడదన్నది వారి రాజకీయ విధానం. అందుకే వారు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ (UPA)కు మద్దతు ఇచ్చారు. ఆ పార్టీలు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడిస్తాయని అన్నారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు. కమ్యూనిస్టులకు ఎప్పుడూ పరోక్షంగా వ్యవహరించాల్సిన అవసరం రాలేదు.
కాబట్టి, నా విశ్లేషణ ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పొత్తుల గురించి ఊహించడం అనేది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్యానం మాత్రమే అవుతుంది తప్ప, దానిని రాజకీయ పరిణామంగా పరిగణించలే.మ‌న్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో నాకున్న ప్రత్యేకతను నేను కోల్పోయానని వారు ఆవేదన వ్యక్తం చేశారు, రాధాకృష్ణ దీనిని అభ్యంతర పెట్టారు. కనీసం ఇప్పుడైనా నా ప్రత్యేకతను వారు అంగీకరించినందుకు సంతోషం. ప్రత్యేకత ఉన్నవారికే అది పోయే ప్రమాదం ఉంటుంది కదా . దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, రాజకీయ పార్టీలు నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కొంతమంది మీడియా విశ్లేషకులు కూడా చాలా శ్రద్ధగా, సులభంగా నన్ను అక్క‌డి ప్ర‌జ‌ల‌కు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని నేను అనుకోను. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కూడా రెండు ప్రాంతాల ప్రజల ఆప్యాయతను చూసిన వ్యక్తిని, వారి ప్రేమను పొందిన వ్యక్తిని నేను. ఒక వివాదం, ఒక అంశం లేదా కొందరు కోరుకునే ప్రచారంతో నాగేశ్వర్ ప్రత్యేకత ఏమీ పోదు. ప్రత్యేకమైన వ్యక్తిగా నా స్థానం అలాగే ఉంటుంది.

గత 40 ఏళ్లుగా నేను చేసిన కృషి, కఠోర శ్రమ నన్ను లక్షలాది మంది ప్రజలకు దూరం చేయలేదు. ఇప్పటికీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాను. విశాఖ ఉక్కు పోరాటంలో నేను పాల్గొన్నప్పుడు, అక్కడ ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో కావాలనే ఉద్దేశంతో పాల్గొనలేదు. అలాగే, 20 ఏళ్ల క్రితం కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కాలని పోరాడినప్పుడు కూడా నేను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు శాసనసభలో నా తోటి ఎమ్మెల్సీలతో కలిసి పోరాడినప్పుడు, విశాఖ అడవుల్లో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనులకు నష్టం వాటిల్లినప్పుడు లేదా గిరిజన మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎటువంటి రాజకీయ ప్రయోజనాలనూ ఆశించ లేదన్నారు నాగేశ్వ‌ర్ రావు.

అత్యంత లాభదాయకమైన కిరండూల్-కోటవలస రైలు మార్గాన్ని ఒడిశాకు కేటాయించడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని నేను భావించాను. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడతామని చెప్పుకునే చాలా మీడియా సంస్థలు దీనిపై కనీసం నోరు కూడా మెదపలేదు. మచిలీపట్నం-పామర్రు ప్రాంతంలో గుర్తించిన విలువైన చమురు, సహజ వాయువు నిల్వలను వేదాంత వంటి వివాదాస్పద సంస్థకు అప్పగించడంపై కూడా ప్ర‌శ్నించాన‌ని చెప్పారు. ఇక‌నుంచైనా రాధాకృష్ణ వాస్త‌వాలు తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

Exit mobile version