ముంబై : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు చెందిన యూట్యూబ్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా బాలీవుడ్ కు చెందిన పాపులర్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ఏకంగా తమకు తీవ్రంగా డ్యామేజ్ జరిగిందంటూ ఆరోపిస్తూ యూట్యూబ్ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ మేరకు తమకు రూ. 4 కోట్ల పరిహారం చెల్లించాలని ఇందులో పేర్కొన్నారు. చాలా మంది సినీ నటులు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ బాలీవుడ్ జంట తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన అభిషేక్ బచ్చన్ అతని భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ తమ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే ఏఐ వీడియోల సృష్టిని తొలగించి నిషేధించాలని న్యాయమూర్తిని కోరారు.
యూట్యూబ్ వీడియోలు ఏమైనప్పటికీ ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు శిక్షణ ఇవ్వకుండా ఉండేలా గూగుల్ రక్షణ చర్యలను కలిగి ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారని రాయిటర్స్ సమీక్షించిన చట్టపరమైన పత్రాలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత సంవత్సరాలుగా కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు భారతీయ కోర్టులలో తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ కూడా వాపోయారు. ఇదే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యక్తిత్వ హక్కుల పరస్పర చర్య, తప్పుదారి పట్టించే లేదా డీప్‌ఫేక్ యూట్యూబ్ వీడియోలు ఇతర ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే ప్రమాదం గురించి కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆన్‌లైన్‌లో తప్పుదారి పట్టించే కంటెంట్ విస్తరించే ప్రమాదం ఉందని నటులు వాపోతున్నారు.
