తమిళనాడు : సినిమాలలోనే కాదు నిజ జీవితంలో, రాజకీయ రంగంలో కూడా రియల్ సూపర్ స్టార్ నని నిరూపించాడు టీవీకే విజయ్. గత రెండు సంవత్సరాల కిందట జస్ట్ చచూచాయిగా ప్రకటన చేశాడు. అంతకు ముందు తాను స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. ఆనాడే రాజకీయాలకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఎంజీ రాంచంద్రన్, జయలలిత తర్వాత తమిళనాడు ప్రజలు ఏకంగా భారీ మెజారిటీని కట్టబెట్టారు టీవీకే పార్టీకి. ఇది సంచలనం కలిగించింది. అత్యంత సామాన్యులకు పార్టీ తరపున టికెట్లు ఇచ్చాడు విజయ్. ఇది ఇతర పార్టీలకు కోలుకోలేని రీతిలో జలక్ ఇచ్చేలా చేసింది. ఇక తమిళనాడు పాలిటిక్స్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది.
రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే చేతులెత్తేశాడు రజినీకాంత్ .రాజకీయ పార్టీ పెట్టి పట్టుమని 5 ఏళ్లు నడపలేక ఇంకో పార్టీ లో విలీనం చేసేశాడు చిరంజీవి. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. పక్క పార్టీల తో పొత్తు పెట్టుకొని పార్టీ ని నెట్టుకొస్తున్నాడు .ఇక కమల్ హాసన్, విజయ్ కాంత్ రాజకీయ ఆరంగ్రేటం ఘనంగా వున్నా, రాజకీయాల్లో రాణించలేక పోయారు అప్పుడు వచ్చాడు #ThalapathyVijay విజయ్. ఇండియన్ పోలిటిక్స్ లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతి పెద్ద పార్టీ గా అవతరించి, అది కూడా అతి కష్టమైన తమిళనాడు లో వున్న రెండు ద్రావిడ పార్టీల కొమ్ములిరిచి, తన సత్తా ఏంటో చాటాడు.
కేవలం సినిమాల్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదు, నేను పోలిటిక్స్ లో కూడా బిగ్గెస్ట్ పొలిటికల్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
