దేశంలో హంత‌క పాల‌న సాగుతోంది

న‌టుడు ప్ర‌కాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

hellotelugu-PrakashRaj

విశాఖ‌పట్నం : ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న ద‌మ‌న‌కాండ‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దేశంలో హంత‌క , రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌కాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాస్వామ్యం ఖూనీ చేయ‌బ‌డుతోంద‌ని, రాజ్యాంగాన్ని మార్చాల‌నే కుట్ర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తెర లేపారంటూ ధ్వ‌జమెత్తారు. ప్రభుత్వాలు విలువైన భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం సరికాదు. సినిమాలు తీయిస్తుంది ఆ పార్టీయే కదా అంటూ ప‌రోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు ప్ర‌కాశ్ రాజ్.

కేరళ ఫైల్స్ మరొక ఫైల్స్ ఏ సినిమా చూసిన హిందూ ముస్లిం ఇదే అంశం తీస్తుంది ఆ మహా నాయకుడే కదా అంటూ ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మావోయిస్టులు ఇత‌ర దేశ‌స్తులు కాదు మనవాళ్లే కదా హంతకులు కాదు టెర్రరిస్టులు కాదని అన్నారు. చంపడం ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు ప్ర‌కాష్ రాజ్. జనజీవన స్రవంతిలో కలపాల్సింది పోయి హత్యలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండ‌డం అత్యంత దారుణం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అగ్ర న‌టుడు. ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు మేల్కొంటార‌ని, ఆరోజు త‌ల వంచ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కేంద్రంపై చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం రేపాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి. ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ పాల‌న‌పై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే హిందూ సంస్థ‌లు, వ్య‌క్త‌ల నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

Exit mobile version