న‌టి నిధి అగ‌ర్వాల్ పై దాడి మాల్ పై కేసు

ఈవెంట్ నిర్వాహ‌కుల‌పై కూడా ఫిర్యాదు

hellotelugu-NiddhiAgerwalMobbed

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజా సాబ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా హాజ‌రైన న‌టి నిధి అగ‌ర్వాల్ పై జ‌నం దూసుకు వ‌చ్చారు. త‌ను కారు ఎక్కేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. అభిమానులు త‌న‌పై దాడి చేసినంత ప‌ని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని లులు మాల్‌పై కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం 3:00 గంటలకు ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించినందుకు మాల్ యాజమాన్యంతో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా జనం మధ్యలో వెళ్తున్నప్పుడు నిధి అగ‌ర్వాల్ ఆందోళనగా, అసౌకర్యంగా కనిపించిన దృశ్యాలు ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని ఆదారంగా చేసుకుని గురువారం కేసు నమోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. నటి నిధి అగ‌ర్వాల్ ప్రాంగణం నుండి బయలు దేరుతున్నప్పుడు, అభిమానులు ఆమె చుట్టూ చేరి ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. దీంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. జనం మధ్యలో వెళ్తున్న స‌మ‌యంలో తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యారు నిధి అగ‌ర్వాల్. దీంతో తేరుకున్న‌ భద్రతా సిబ్బంది వెంట‌నే ఆమెను కారు వ‌ద్ద‌కు తీసుకు వెళ్లారు. ఒక సెలబ్రిటీని ఆహ్వానించి, అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించారు. అందుకే మేం కేసు నమోదు చేశామ‌ని తెలిపారు కేపీహెచ్ బీ పోలీసులు.

(This Vedio Creit India Today)

https://www.youtube.com/watch?v=W3CQNQjjmBQ

Exit mobile version