Constipation : ఇప్పటి ఆధునిక జీవనశైలిలో మలబద్ధకం (Constipation) సమస్య సాధారణంగా మారిపోయింది. అయితే ఈ సమస్యను చాలా మంది బయటకు చెప్పడానికే ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం ఉన్న వ్యక్తులు శారీరకంగా, మానసికంగా అసౌకర్యంగా భావిస్తారు. ఇది రోజువారీ పనుల్లో అడ్డంకిగా మారుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఇంట్లో అందుబాటులో ఉండే పౌష్టిక పదార్థాల సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
Constipation – మలబద్ధకానికి ప్రధాన కారణాలు
తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, నీరు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, తరచూ ప్రయాణాలు చేయడం, కొన్ని మందుల ప్రభావం, జీర్ణవ్యవస్థ బలహీనత, థైరాయిడ్ లేదా నాడీ సంబంధిత సమస్యల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పెరుగు, అవిసె గింజలతో సహజ చికిత్స
ప్రముఖ పోషకాహార నిపుణులు సూచిస్తున్న ప్రకారం, మలబద్ధకం (Constipation) నుంచి ఉపశమనం పొందాలంటే రోజు 100 గ్రాముల తాజా పెరుగు తీసుకోవాలి. ఇందులో ఒక టీస్పూన్ అవిసె గింజలు లేదా అవి పొడిగా వేసి కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. కొన్ని రోజుల్లోనే ఈ చిట్కాతో మెరుగైన మార్పును గమనించవచ్చు.
పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగు ప్రోబయోటిక్ ఆహారం. ఇందులో ఉండే మంచినే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ, ప్రేగుల కదలిక మెరుగవుతుంది
- కాల్షియం, భాస్వరం వంటి పోషకాలతో ఎముకలు బలంగా ఉంటాయి
- మలబద్ధకం, గ్యాస్, తలనొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి
- రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది
- కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అవిసె గింజల ప్రత్యేకత
అవిసె గింజలలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి.
- ఇవి మలాన్ని మృదువుగా చేసి, శరీరం నుంచి సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి
- జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి
- రక్తపోటు, షుగర్ నియంత్రణలో సహాయపడతాయి
- క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఇవి కలిగి ఉంటాయని పరిశోధనల్లో వెల్లడి
జీవనశైలిలో అవసరమైన మార్పులు
- ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి
- రోజూ తగినంత నీరు తాగాలి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి
Also Read : Belly Fat Effective Solution : మీరు రోజు ఈ అవిసె గింజలు తిన్నారంటే ఎలాంటి వారికైనా పొట్ట తగ్గాల్సిందే



















