Anil Kumar Yadav : నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) కూటమి సర్కార్ కు సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలకు సీటింగ్ జడ్జితో విచారణ వేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. తాను ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటన అడ్డుకునేందుకు రెండు వేలమంది పోలీసులను పెట్టారని ఆరోపించారు.ఎక్కడికక్కడ బ్యారికెడ్లు పెట్టారు, రోడ్లు తవ్వేసినా.. జగన్ కోసం వేలాది మంది తరలి వచ్చారని అన్నార.
Anil Kumar Yadav Slams NDA Govt
జగన్ భద్రత కోసం పది మంది పోలీసులు, జగన్ వద్దకు జనం రాకుండా రెండు వేల మంది పోలీసుల ను పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్టు వేల కోట్లు నావద్ద ఉందని నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే అమరావతికి విరాళంగా తానే ఇస్తానంటూ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నా ఆస్తుల్లో రూపాయి పెరిగినా విచారణకు సిద్ధమేనని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్. సిట్టింగ్ జడ్జితో విచారణ కు నేను సిద్దం. అంతే కాదు సీఎం నారా చంద్రబాబుకి లేఖ రాయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పారు.
గత కొద్ది రోజులుగా నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు . అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం లో నాపేరు ఉందని చెప్పారు.. వాంగ్మూలం తీసుకునేటప్పుడు అందులో వాస్తవాలు ఏమిటో చూడాలని అన్నారు. కాకాని నేను కలిసి మైనింగ్ చేశామని వాంగ్మూలం లో రాసుకున్నారని ఆరోపించారు. గతంలో తనకు మాజీ మంత్రి కాకాని కి మనస్పర్థలు ఉండేవన్నారు. అలాంటప్పుడు మేము కలిసి ఎలా వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అసలు వారు చెప్పిన లే అవుట్ లు లేనే లేవన్నారు. 2023 లో మైనింగ్ లో డబ్బులు వస్తే.. 2022 లో వెంచర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
Also Read : BSNL Sensational Offer : బిఎస్ఎన్ఎల్ ఆఫర్ 1 రూపాయికే ఫ్రీడం ప్లాన్
















