నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. పనిలో పనిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మండిపడ్డారు. తన మంత్రి పదవి కాపుడుకోడానికి ‘కోతల వెంకట్ రెడ్డి’ ఆర్భాటాలు చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశాడు. జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్నాడని ఆరోపించారు. .HAM రోడ్స్ పేరుతో పెద్ద స్కాం కు శంకుస్థాపన చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
హ్యాం రోడ్లు అన్ని వట్టివేనని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి. కమిషన్ల కోసమే హంగామా సృష్టిస్తున్నారని ఆరోపించారు. కోతల వెంకట్ రెడ్డి ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండకు వచ్చిన ప్రతిసారి నిధులిచ్చి అభివృద్ధి చేశాడని అన్నారు. అంతే కాకుండా పట్టణానికి మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం, రూ.1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారని చెప్పారు.
అయితే ఇద్దరు మంత్రులు స్కామ్ లు, మిల్లర్ల వద్ద మూడుపులు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. తుమ్మితే ఊడి పోయేలా ఉన్న మంత్రి పదవిని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి రేవంత్‌ను కాకా పెట్టేందుకు సభ పెడుతున్నాడని అన్నారు .తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని, అందుకే హడావుడి చేస్తూ షో పుటప్ చేస్తున్నాడని అన్నారు జగదీశ్ రెడ్డి.


















