Kesineni Chinni : అమరావతి – కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు, ఎంపీతో పాటు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ గారు, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , తంగిరాల సౌమ్య . గత ప్రభుత్వం హయాంలో జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలలో వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టు లోని కోటి రూపాయల మోటారు సామాగ్రి దొంగల పాలు చేసిన ఘనత వైసీపీ సర్కార్ కు దక్కుతుందన్నారు.
MP Kesineni Chinni Key Statement for Farmers
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే 500 కోట్లు నీటి పారుదల కు ఖర్చు పెడుతున్నారని చెప్పారు ఎంపీ. వేదాద్రి, కంచల ఎత్తి పోతల పథకాన్ని పరిశీలించి పథకం మళ్ళీ రన్నింగ్ లోకి రావాలంటే 15 కోట్ల రూపాయలు అవసరమని అన్నారు. ఎంపీ నిధుల ద్వారా ప్రస్తుతం 35 లక్షలు విడుదల చేసి మోటార్లు మరమ్మత్తులు చేపిస్తున్నట్లు చిన్ని (Kesineni Chinni) చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలి పివేసిన ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరు మార్చి ఒక్క ఇటుక కూడా కదపలేదని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మెగా ఇంజనీరింగ్ సంస్థ కి అప్పగించి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం దానికి సంబందించిన జీవో విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : MP Eatala Rajender Shocking Comments : నాది స్ట్రెయిట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ కాదు


















