న్యూఢిల్లీ : లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఆయన అనుసరిస్తున్న విధానం ఇండియా కూటమికి సరిపోదని అన్నారు. తన వల్లనే ఇండియాలో బీజేపీ పవర్ లోకి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మాజీ సీఎం చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీని కుదిపేశాయి. దీనిపై సీరియస గా స్పందించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సొంత రాజకీయ పతనానికి రాహుల్ గాంధీని బాధ్యులను చేస్తూ సీపీఎం విమర్శలు చేస్తోందన్నారు.
ఎదుర్కొంటున్న సమస్యలకు రాహుల్ గాంధీని నిందించడం అనేది ముఖం బాగోలేదని అద్దాన్ని పగలగొట్టడం లాంటిదని ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ధ్వజమెత్తారు. గాంధీపై మార్క్సిస్ట్ పార్టీ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ రాజకీయ అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఈ పరిణామంలో, వామపక్ష పార్టీ తన సొంత రాజకీయ పతనం , ఎన్నికల వైఫల్యాలకు కాంగ్రెస్ నాయకుడిని బాధ్యుడిని చేస్తోందని వేణుగోపాల్ ఆరోపించారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా స్పందిస్తూ గాంధీపై మార్క్సిస్ట్ పార్టీ చేస్తున్న దాడులు దాని రాజకీయ అభద్రతా భావాన్ని , ఇటీవలి ఓటములకు గల కారణాలను నిష్పాక్షికంగా అంచనా వేయలేక పోవడాన్ని సూచిస్తున్నాయని కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు తీవ్రస్థాయిలో.

















