తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ మద్దతు లేకుండానే టీవీకే పార్టీ విజయ్ అధికారంలోకి రానున్నారు. నిన్నటి దాకా పవర్ లో ఉన్న డీఎంకే, మొన్నటి వరకు అధికారంలోకి రావాలని అనుకున్న అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలకు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు. 234 స్థానాలకు గాను 111 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర తిరగ రాశారు. ఎంజీ రాంచంద్రన్, జయలలిత తర్వాత సినీ రంగానికి చెందిన విజయ్ అధికారంలోకి రానుండడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో విచిత్రం ఏమిటంటే ద్రావిడ పార్టీలుగా పేరు పొందిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఓట్లను భారీగా చీల్చాడు టీవీకే విజయ్. ఇందులో బిగ్ సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 37.7 శాతంగా ఉన్న డీఎంకే ఓట్ల వాటా ఇప్పుడు 23.99 శాతానికి పడిపోయింది; అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 33.29 శాతం ఓట్లు సాధించిన ఏఐడీఎంకే వాటా, సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 21.87 శాతానికి తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 18 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, ఇప్పుడు కేవలం 3.09 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ ఓట్ల వాటా మాత్రం స్వల్పంగా ఎక్కువగా ఉండి, 3.64 శాతంగా నమోదైంది. మరో వైపు భారీ ఎత్తున యూత్ , మహిళలు టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపారు. వీరి సపోర్ట్ అధికారంలోకి రావడానికి, పెద్ద ఎత్తున సీట్లు వచ్చేందుకు దోహద పడింది.
















