న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనిల్ కు చెందిన రిలయన్స్ గ్రూప్‌పై దర్యాప్తులో రూ. 3,034 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. . జప్తు చేసిన ఈ ఆస్తులు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్ – ఇన్ ఫ్రా) సంస్థలకు చెందినవి ఉన్నాయని వెల్లడించింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా జప్తు చేసిన ఆస్తులలో ముంబైలో ఒక ఫ్లాట్, మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ అయిన ఖండాలాలో ఒక ఫామ్‌హౌస్, సనంద్ (అహ్మదాబాద్)లో కొన్ని భూములు ఉన్నాయని తెలిపింది ఈడీ.
అంతే కాకుండా ఆర్ ఇన్ఫాకు చెందిన 7.71 కోట్ల షేర్లు తదితరాలు ఉన్నాయని స్పష్టం చేసింది . ఈ ఆస్తులను జప్తు చేసేందుకు గాను, మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక తాత్కాలిక జప్తు ఉత్తర్వును జారీ చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌పై నమోదైన కేసులలో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ. 19,344 కోట్లకు చేరింది. బ్యాంక్ మోసం,, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ గ్రూప్‌పై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఇంకా దర్యాప్తు ముగియ లేదని పేర్కొంది.















