హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను, సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి చోటు చేసుకుందని ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో నియమించిన కమిషన్ నివేదికను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. దీనిపై స్పందించారు కేటీఆర్. ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం, ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఈ ఒక్క తీర్పుతో వాస్తవాలు ఏమిటో తెలిసి పోయిందన్నారు. ప్రజలకు ఎవరు దొంగలో తేలి పోయిందన్నారు కేటీఆర్.
కుట్రలు, కుతంత్రాలకు తావు లేదని అర్థమైందని అన్నారు. ధర్మాసనం వాస్తవాలు ఏమిటో తెలియ చెప్పిందని తీర్పుతో. ఈ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దొంగ అని స్పష్టమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క తీర్పుతో బీఆర్ఎస్ గెలవలేదని, నాలుగున్నర కోట్ల ప్రజలు సాధించిన విజయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతిపతి జయశంకర్, నీళ్ల మేధావి విద్యాసాగర్ రావులు చేసిన కృషికి దక్కిన గౌరవం ఈ తీర్పు అని స్పష్టం చేశారు. గల గల పారే గోదావరి నీళ్లు పారుతున్నంత కాలం కేసీఆర్ బతికే ఉంటాడని, ఆయన పేరును చెరిపేసే హక్కు ఎవరికీ లేదన్నారు కేటీఆర్.

















