న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవడంతో స్పందించారు. లోక్ సభలో ప్రసంగించారు. మోదీ మ్యాజిక్ పని చేయలేదని , అమిత్ షా ట్రబుల్ షూటర్ గా ఫెయిల్ అయ్యాడంటూ ఎద్దేవా చేశారు. బాలాకోట్, పెద్దనోట్ల రద్దు, ఆపరేషన్ సిందూర్‌ల ఇంద్రజాలికుడిగా పేర్కొన్నారు. ఒక రకంగా ఎద్దేవా చేయడంతో సభలో సభ్యులంతా నవ్వడం విస్తు పోయేలా చేసింది. దీంతో బీజేపీ సభ్యులు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరాలపై 2019లో జరిగిన వైమానిక దాడులు, 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు, గత సంవత్సరం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలపై జరిపిన సరిహద్దు దాడులతోసహా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ.
మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదన్నారు. కానీ ఆ బిల్లు పేరుతో అన్యాయంగా, అక్రమంగా కొన్ని రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా లోపాయికారిగా, కుట్ర పూరితంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకు వస్తామంటే ఎలా అని ప్రశ్నించారు కేంద్ర సర్కార్ ను. ఈ బిల్లులు సభలో ఆమోదం పొందవని మోదీ, అమిత్ షాలకు తెలుసన్నారు. జీవిత కాలమంతా ఈ దేశాన్ని బీజేపీ పాలించాలని అనుకుంటోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. చివరకు మెజీషియన్ చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు.
















