Nara Lokesh : విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును విశాఖపట్నం వేదికగా ప్రారంభించింది. ఇవాల్టితో సదస్సు ముగియనుంది. యావత్ ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఇక్కడ కొలువు తీరాయి. ఆయా కంపెనీలకు సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు , కన్సల్టెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తో భేటీ అయ్యారు సాగర్ డిఫెన్స్ సంస్థ నిర్వాహకులు.
IT Minister Nara Lokesh Meet
ఇదిలా ఉండగా మానవ రహిత సముద్ర వ్యవస్థలు, అటానమస్ వెసల్స్, డిఫెన్స్ సొల్యూషన్స్ లో పేరు పొందింది సదరు సంస్థ. ఈ సందర్బంగా సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి. 2015లో ఏర్పాటైన ఈ సంస్థ సముద్ర భద్రత, నిఘా, పర్యావరణ పరిరక్షణ కోసం అత్యాధునిక ప్లాట్ ఫాంలను డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పాల్సిందిగా కోరారు నారా లోకేష్. మంత్రి చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించారు సాగర్ డిఫెన్స్ ప్రతినిధులు.
ఇదిలా ఉండగా ఈ సంస్థ ఏర్పాటు చేసే మెరైన్ కంపెనీని ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తమ సర్కార్ ఉపాధి కల్పనపై ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పారు మంత్రి నారా లోకేష్. సీఐఐ సదస్సు ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా తాము పెట్టుకున్నామని తెలిపారు.
Also Read : Minister Nara Lokesh Important Update : డేటా సెంటర్లను నెలకొల్పండి : లోకేష్


















