Maganti Sunitha : హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో బరిలో ఉన్నారు మాగంటి సునీత గోపీనాథ్ (Maganti Sunitha). ఈ సందర్బంగా ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్. అన్నీ తామై వ్యవహరిస్తున్నారు బావ బావమరుదులు , మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు. ఇప్పటికే క్యాంపెయిన్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు బి – ఫామ్ అందజేశారు. అంతే కాకుండా ఎన్నికల ఖర్చుల కోసం స్వయంగా పార్టీ తరపున రూ.40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
Maganti Sunitha Gets B-Form from KCR
ప్రచారం సందర్బంగా తన భర్త మాగంటి రవీంద్రనాథ్ అకాల మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మాగంటి సునీత. ప్రజలతో మమేకం అవుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతో పాటు తన పిల్లలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని, తమ తల్లిని గెలిపించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకోవడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ . ఆమె ఓట్ల కోసం ఏడుస్తోందని, అదంతా నటన తప్ప మరోటి కాదన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు.
Also Read : MP Raghunandan Rao Strong Demand : దుబ్బాక బస్ డిపోను పునరుద్దరించండి : ఎంపీ


















