YS Sharmila : విశాఖపట్నం : ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. సోమవారం ఆమె విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ బడుల్లో త్రాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కడుపుకు బుక్కెడు అన్నం పెట్టలేని దిక్కుమాలిన పాలన సీఎం చంద్రబాబుది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా మారిందన్నారు. కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు త్రాగి ఇద్దరు విద్యార్థినిలు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). పాలనా పరంగా వైఫల్యంతో ముక్కు పచ్చలారని బిడ్డలను పొట్టన పెట్టుకున్నందుకు సిగ్గు పడాలన్నారు. 128 మంది గిరిజన బిడ్డలు ఆసుపత్రుల పాలయ్యారంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం తప్పా మరోటి కాదన్నారు.
YS Sharmila Slams AP Govt
చనిపోయిన బిడ్డల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆమె కోరారు. అత్యవసర వార్డుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకు మెరుగైన వైద్యాన్ని అందేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. ఈ ఘటన మరోచోట పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరపాలన్నారు. మీ నిర్లక్ష్యాన్ని రోగాలపై నెట్టి తప్పుకుందామని చూస్తే ఊరుకొనేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గిరిజన బిడ్డలు, వారి సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి లెక్కే లేదంటూ ధ్వజమెత్తారు. బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ అసలే లేకుండా పోయిందన్నారు. ఏం చేసినా అడగరని కూటమి ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందన్నారు. వసతి గృహాలు కాదవి..సమస్యలకు లోగిళ్ళుగా మారాయంతో ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.
Also Read : Harish Rao Fired on Telangana Govt : హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్


















