Urvashi Rautela : ఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ కేసు విషయంలో విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన నటీ నటులతో పాటు సెలిబ్రిటీలకు నోటీసులు ఆరీ చేసింది. కొందరు విచారణకు హాజరయ్యారు. మరికొందరిని విచారిస్తోంది. ఇందులో భాగంగా కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ. ఈ మేరకు ముంబైకి చెందిన ప్రముఖ నటి ఊర్వశి రౌటేలాకు (Urvashi Rautela) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 16న మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. మరో వైపు బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి మరో ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి 15న సోమవారం విచారణకు హాజరయ్యారు.
Urvashi Rautela Shocking
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఢిల్లీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శిఖర్ దావన్, సురేష్ రైనా. ఈ కేసుకు సంబంధించి పలు కీలక ప్రశ్నలు సంధించింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రోత్సహించడంలో ప్రముఖులు, ప్రభావశీలుల పాత్రను ఏజెన్సీ పరిశీలిస్తున్నందున మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు ఈడీకి చెందిన ఓ సీనియర్ అధికారి. ప్రజా ప్రముఖుల ప్రచార ప్రచారాలు యాప్ తన పరిధిని విస్తరించడానికి, కొత్త ఆటగాళ్లను ఆకర్షించడానికి సహాయపడ్డాయా అనే కోనంలో ఈడీ పరిశీలిస్తోంది.
Also Read : Minister Nimmala Interesting Comments : దేశం గర్వించ దగిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య


















