Gold : దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల కొనసాగుతున్నాయి. రోజురోజుకూ తులం ధరపై వందల రూపాయల చొప్పున పెరుగుతుండటంతో సాధారణ కొనుగోలుదారులు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పెట్టుబడులకు, ఆభరణాల కొనుగోళ్లకు మొదటి ఎంపికగా ఉన్న బంగారం (Gold), ఇప్పుడు అధిక ధరలతో భయపెడుతోంది.
సెప్టెంబర్ 1 నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,090 చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.96,340 గా నమోదైంది. ఇదే సమయంలో ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.96,190 గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1,24,900కు చేరింది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (సెప్టెంబర్ 1 నాటికి)
- హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.1,04,940 | 22 క్యారెట్లు – రూ.96,190
- ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,05,090 | 22 క్యారెట్లు – రూ.96,340
- ముంబై: 24 క్యారెట్లు – రూ.1,04,940 | 22 క్యారెట్లు – రూ.96,190
- చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,04,940 | 22 క్యారెట్లు – రూ.96,190
- బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,04,940 | 22 క్యారెట్లు – రూ.96,190
ధరల పెరుగుదల వెనుక కారణాలు
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, బంగారం ధరలు పెరగడానికి అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం
- డాలర్ విలువలో మార్పులు
- అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికం కావడం
- ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం
అంతేకాదు, రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : Today Gold Price : నేడు భగ్గుమన్న బంగారం ధరలు



















