Today Gold Price : చూస్తుండగానే పరుగులు పెడుతున్న పసిడి ధరలు

మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1,24,900కు చేరింది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల కొనసాగుతున్నాయి. రోజురోజుకూ తులం ధరపై వందల రూపాయల చొప్పున పెరుగుతుండటంతో సాధారణ కొనుగోలుదారులు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పెట్టుబడులకు, ఆభరణాల కొనుగోళ్లకు మొదటి ఎంపికగా ఉన్న బంగారం (Gold), ఇప్పుడు అధిక ధరలతో భయపెడుతోంది.

సెప్టెంబర్ 1 నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,090 చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.96,340 గా నమోదైంది. ఇదే సమయంలో ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,04,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.96,190 గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1,24,900కు చేరింది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (సెప్టెంబర్ 1 నాటికి)

ధరల పెరుగుదల వెనుక కారణాలు

బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, బంగారం ధరలు పెరగడానికి అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

అంతేకాదు, రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : Today Gold Price : నేడు భగ్గుమన్న బంగారం ధరలు

Exit mobile version