KTR : హైదరాబాద్ – గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR).ఈ తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదన్నారు. గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు.
KTR Slams CM Revanth Reddy
బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కర్రె సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజ స్వరూపం మరోసారి ఈ తీర్పుతో బట్ట బయలైందన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు కేటీఆర్ (KTR). రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటి చెప్పిన న్యాయ వ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం అన్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా పార్టీ శ్రేణులు నిలవాలని పిలుపునిచ్చారు.
వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడారు కేటీఆర్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా, ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు.
Also Read : AP BJP Chief PVN Madhav Satisfied : ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్
















